జస్ట్ మూడే గంటలు.. కేవలం 40 మంది సోల్జర్స్.. కొవిడ్ దవాఖానను రెడీ చేసేశారు. ఇండియా- పాక్ బార్డర్‌కు సమీపంలోని రాజస్థాన్ బాడ్మేర్ జిల్లాలో ఆక్సిజన్ బెడ్ల కొరతతో కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఇలా మన ఆర్మీ రంగంలోకి దిగి నూరు ఆక్సిజన్ బెడ్లతో హాస్పిటల్‌ను నిర్మించేసింది.
