ఘోరం: కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి ..గద్వాల్ జిల్లా అలంపూర్ లో ఘటన

ఘోరం: కుక్కల దాడిలో 40 గొర్రె పిల్లలు మృతి ..గద్వాల్ జిల్లా అలంపూర్ లో ఘటన

అలంపూర్,వెలుగు : కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన గద్వాల్ జిల్లాలో జరిగింది. బాధిత గొర్రెల కాపరులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . అలంపూర్ టౌన్ పరిధి గంటల శివాలయం సమీపంలో ఈశ్వర్, కొండేరు సాయి తమ 40 గొర్రె పిల్లలను కంచెలో ఉంచి,  గురువారం మిగతా గొర్రెలను మేతకు తోలుకెళ్లారు. కంచె లోని గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. దీంతో రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.