ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు

ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు

ఎటు చూసినా కవలలే!

దేశంలోని ఒక్కో ప్రాంతా నికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ప్రాంతాలు గుడులకు పాపులర్. మరికొన్ని ప్రదేశాలు ఎక్కడా లేని వింతలకు ఫేమస్. ఏ ప్రత్యేకతలు లేకుండా ఫేమస్ అయినవి మనదేశంలో మూడు ఊళ్లున్నాయి. ఈ మూడూ మూడు చోట్ల ఉన్నాయి. ఒకటి ఉత్తరప్రదేశ్‌లో, మరొకటి కేరళలో, మూడోది తమిళనాడులో. ఈ మూడింటి ప్రత్యేకత ఒకటే… అక్కడ కవలలు ఎక్కువగా పుట్టడం! తల్లి గర్భం నుంచి ఒకే కాన్పులో ఒకరికన్నా ఎక్కువ మంది పుడితే వారిని ‘కవలలు’ అంటారు. ఇద్దరు పిల్లలు కొద్దిపాటి టైమ్ గ్యాప్‌లో కవలలుగా పుట్టడం కామన్. కవలలు రెండు రకాలు. ఒకే పోలికలతో ఇద్దరు పిల్లలు పుడితే వాళ్లను ‘మోనోజైగోటిక్ ట్విన్స్ ’ అంటారు. ఇద్దరు పిల్లలు వేర్వేరు పోలికలతో ఉంటే వారిని ‘డైజైగోటిక్ ట్విన్స్ ’ అంటారు. ట్విన్స్ పుట్టడానికి రెండు ప్రధాన కారణాలుంటాయి. ఆడవాళ్లలో రెండు అండాలు విడుదల కావడం మొదటి కారణం. రెండు అండాలు విడుదలై, రెండు వీర్య కణాలతో సంయోగం చెందినప్పుడు కవలలు పుడతారు. ఇలా పుట్టే కవలల్లో ఆడ, మగ ఇద్దరూ ఉండొచ్చు. ఫలదీకరణం చెందిన తరువాత పిండం విభజన జరగడంతో పుట్టే కవలలు ఇద్దరూ ఆడ లేదా ఇద్దరూ మగ అయి ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా కవలలు పుడతారని డాక్టర్లు అంటారు.

కవలల పల్లె మహమ్మదాపూర్ ఉమ్రి

మహమ్మదాపూర్ ఉమ్రి ఉత్తరప్రదేశ్ లోని ఓ చిన్న పల్లె. అలహాబాద్ రైల్వే స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జనాభా కూడా వెయ్యిలోపే. ఎటు చూసినా పూరిళ్లు, అక్కడక్కడ చిన్న చిన్న దుకాణాలు కనిపిస్తాయి. ఏ స్పెషాలిటీ లేని ఇంత చిన్న ఊరికి దేశంలోనే ఒక గుర్తింపు తీసుకువచ్చింది ఎవరో కాదు, కవలలే. మహమ్మదాపూర్ కవలలకు ఎంతగా ఫేమస్ అంటే ఊరిని ‘కవలల రాజధాని (ట్విన్స్ కేపిటల్)’ అని కూడా అంటారు. ఊరి జనాభా 900 మంది అయితే, దీనిలో 65 జతల కవలలు కనిపిస్తారు. కవలలు చాలా ఊళల్లో ఉంటారుగానీ, ఈ స్థాయిలో ఉండరు. ఉమ్రి ఊరు పూర్తిగా డిఫరెంట్. మిగతా ఊళ్లతో పోలిస్తే ఈ ఊళ్లో కవలల పుట్టడం మూడు వందల శాతం ఎక్కువ. సహజంగా కవలలు ఎక్కడ ఉంటే అక్కడ కామెడీ ఉంటుంది. ఒకరిని చూసి మరొకరు అని చాలామంది భ్రమపడి మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు తల్లులు కూడా కన్‌ఫ్యూజ్ అయి పాలిచ్చిన బాబుకే మళ్లీ రెండోసారి పాలిస్తుంటారట.

150 జతల కవలల ఊరు ‘శీర్కాళి’

ట్విన్స్ అంటే గుర్తుకు వచ్చే మరో ప్రాంతం ‘శీర్కాళి ’. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉన్న ఈ చిన్న పట్టణంలో 150 జతల కవలలున్నారు. కవలలకు ఫేమస్ అయిన అన్ని ఊళ్లకు వెళ్లినట్లుగా శీర్కాళి పట్టణానికి కూడా సైంటిస్టులు వచ్చారు. ఒకసారి కాదు… చాలాసార్లు వచ్చారు. రకరకాల శాంపిల్స్ తీసుకెళ్లారు. రీసెర్చ్ చేశారు. ఆ రహస్యాన్ని ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. శీర్కాళి టౌన్‌లోని ఏ స్కూలుకెళ్లినా గుంపులు గుంపులుగా కవలలు కనిపిస్తుంటారు. వాళ్లకు చదువు చెప్పే టీచర్లు కూడా పోల్చుకోలేరట. కవలలను పోల్చుకోవడానికి తాము చాలా కష్టపడుతున్నామంటున్నారు ఓ స్కూలు హెడ్ మాస్టర్ జాషువా ప్రభాకర్ సింగ్.

400 జతల కవలల పట్టణం కొడిని
కవలల కథలో కొడిని ఊరుది ఎవరూ అందుకోలేని రికార్డే. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న ఈ చిన్న పల్లెటూరు, కవలలకు ఫేమస్. ఏకంగా 400 జతల కవలలు ఈ చిన్న ఊళ్లో కనిపిస్తారు. ఊరి జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది కవలలే. సహజంగా పాతికేళ్లు దాటిన వాళ్లలోనే ట్విన్స్ పుడతారంటారు. అక్కడ ఇరవై ఏళ్ల లోపునే కవలలు పుడుతున్నారు. అలాగే, ఐదడుగుల మూడు అంగుళాల లోపు హైట్ ఉన్న ఆడవాళ్లకే కవలలు పుడతారన్నది ఒక నమ్మకం. కొడిని టౌన్‌లో ఆడవాళ్ల యావరేజ్ హైట్ ఐదడుగులు. వేరే ఊరు అమ్మాయిని ఈ ఊరి అబ్బాయి పెళ్లి చేసుకున్నా కవలలే పుడుతున్నారు.

For More News..

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

20 వేల ఏండ్ల కిందటి అలుగు.. చెక్కుచెదరని దేహం