ఎల్వోసీ వెంబడి 400 మంది టెర్రరిస్టులు

ఎల్వోసీ వెంబడి 400 మంది టెర్రరిస్టులు

మన దేశంలోకి అక్రమంగా పంపేందుకు పాకిస్తాన్​ కుట్ర

న్యూఢిల్లీ: ఈస్టర్న్ లడఖ్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) దగ్గర ఇండియా, చైనా మధ్య టెన్షన్ పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ భారీల కుట్ర పన్నుతోంది. జమ్మూకాశ్మీర్ లోకి 400 మంది టెర్రరిస్టులను అక్రమంగా పంపేందుకు ప్లాన్ చేస్తోంది. ఎల్వోసీ వెంబడి దాదాపు 400 మంది టెర్రరిస్టులు చొరబాటుకు రెడీగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. టెర్రరిస్టులు చొరబడేందుకు వీలుగా పాకిస్తాన్ నిరంతరం సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని తెలిపాయి. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పై దాడుల కోసం బార్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ)ను పాకిస్తాన్ ఆర్మీ యాక్టివేట్ చేసిందని పేర్కొన్నాయి. ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లో టెర్రరిస్టులు ఉన్నట్లు తెలిపాయి. గురెజ్, మచ్చల్, కెరాన్, తంగ్ ధర్, నౌగాం సెక్టార్లు, ఉరి, పూంఛ్, బీంభర్ గాలి, కృష్ణ వ్యాలీ, నౌషెరా, అఖ్నూర్, ద్రాస్ సెక్టార్లలో పెద్ద ఎత్తున టెర్రరిస్టులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్​ రిపోర్ట్ వెల్లడించింది. చైనాతో బార్డర్ లో టెన్షన్ పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకోవాలని పాక్ కుట్ర చేస్తున్నట్లు సెక్యూరిటీ ఏజెన్సీస్ తెలిపాయి.

For More News..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు కట్టినోళ్లంతా పాస్!

అంపైర్‌ను బాల్​తో కొట్టిన జొకోవిచ్.. డిస్ క్వాలిఫై చేసిన రిఫరీలు