తాడ్వాయి, వెలుగు : మండలంలోని కన్కల్ గ్రామంలో గురువారం ఓ సర్పంచ్ అభ్యర్థి బిందెలు పంచుతుండగా ఎన్నికల స్పెషల్ టీం పట్టుకుంది. అభ్యర్థి నుంచి 41 బిందెలను సాధ్యం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా వస్తువులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు.
