ఎలక్టోరల్ బాండ్ల కేసులో...విచారణ ఎదుర్కోనున్న 41 కంపెనీలు 

ఎలక్టోరల్ బాండ్ల కేసులో...విచారణ ఎదుర్కోనున్న 41 కంపెనీలు 

న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.2,471 కోట్లు ఇచ్చిన 41 కంపెనీలు సీబీఐ, ఈడీ,  ఐటీ డిపార్ట్‌‌మెంట్ విచారణలను ఎదుర్కోనున్నాయి. వీటిపై దాడులు జరిగిన తరువాత బీజేపీకి రూ.1,698 కోట్లు విరాళంగా ఇచ్చాయని పౌర సంఘాల కార్యకర్తలు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటీషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, కనీసం 30 షెల్ కంపెనీలు రూ. 143 కోట్లకు పైగా విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయన్నారు.

ప్రభుత్వం నుంచి 172 మేజర్ కాంట్రాక్టులు, ప్రాజెక్టుల అనుమతులు పొందిన 33 గ్రూపులు కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చాయని చెప్పారు. బీజేపీకి రూ.1,751 కోట్ల ఎలక్టోరల్ బాండ్ విరాళాలు ఇచ్చినందుకు మొత్తం రూ.3.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందారని ఆయన ఆరోపించారు.  ఈడీ ,  సీబీఐ, ఐటీ దాడులు జరిగిన వెంటనే మూడు నెలల్లో రూ.121 కోట్లు ఇచ్చారన్నారు.