
"మా వానికి పిల్లనిస్తలేరు.. ఎవరైనా ఉంటే చెప్పండి! మీసైడు ఎవరైనా ఉన్నారా..! కట్నం ఇవ్వకపోయినా పర్లేదు, అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు.. చేసేసుకుంటాం.. కాస్త చెప్పండయ్యా" పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉన్న ప్రతి తల్లిదండ్రుల నోట ఇదే మాట. అంతకంతకూ అమ్మాయిల సంఖ్య తగ్గిపోవటం అందుకు ప్రధాన కారణమైతే, పెళ్లీడుకు రాగానే ప్రభుత్వం ఉద్యోగం ఉన్నవారినో.. డబ్బుండి వయసు మళ్లిన వారిని యువతులు పెళ్లాడుతుండటం మరొక కారణం. అది నిజం కాదు అని మీరంటే ఈ కథనం చదవాల్సిందే.
41 ఏళ్ల వయసున్న ఓ ఎమ్మెల్యే.. 21 ఏళ్ల యువతిని పెళ్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన స్వపన్ మజుందార్ ఇటీవల ఓ ఇంటి వారయ్యారు. బొంగావ్, అమలపారా నివాసి రింకు బైరాగి మిస్త్రీ కుమార్తె త్రిష మిస్త్రీని ఆయన వివాహమాడారు. వీరి వివాహాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేనప్పటికీ.. వధూవరుల మధ్యనున్న వయసు తేడా నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తోంది. అందువల్లే వీరి పెళ్లి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
స్వపన్ మజుందార్ పెళ్లాడిన ఆ వధువు వయసు.. 21 సంవత్సరాలు. ఇటీవలే ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. వీరి వివాహానికి పలువురు పశ్చిమ బెంగాల్ బీజేపీ అగ్రనేతలు సహా వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారట. అంగరంగ వైభవంగా పెళ్లి తంతు జరిగిందట. వరుడు నల్లటి షేర్వాణీని ధరించగా.. వధువు నీలం రంగుల బనారసీ చీరను ధరించి బెంగాలీ వస్త్రాధరణలో తళుక్కుమంటోంది. వధువుకు మేకప్ అతిగా వేయడం వల్ల వయసు ఎక్కువగా అనిపిస్తున్నా.. 21 ఏళ్లే. దీంతో వీరి పెళ్లి గురుంచి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు. ఇక పెళ్లికానీ యువకులైతే.. 'ఇలా అయితే ఒంటరిగానే మిగిలిపోతాం మామ..' అని వారిలో వారు చర్చించుకుంటున్నారు.