సెకండ్ వేవ్ లో 420 మంది డాక్టర్లు మృతి

సెకండ్ వేవ్ లో 420 మంది డాక్టర్లు మృతి

కరోనా సెకండ్ వేవ్ సామాన్యులతో పాటు డాక్టర్ల ప్రాణాలు తీస్తోంది. కరోనా పేషంట్లను కాపాడేందుకు 24 గంటలు కృషి చేస్తున్నారు డాక్టర్లు. దీంతో వారిపైనా కరోనా అటాక్ చేస్తుంది. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 420 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోషియేషన్. ఇందులో ఢిల్లీకి చెందిన వారే వంద మంది డాక్టర్లు ఉన్నారని స్పష్టం చేసింది. బిహార్ లో 80 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్ లో 40, బెంగాల్ లో 30 మందికి పైగా డాక్టర్లు కరోనాపై పోరులో చనిపోయారని తెలిపింది.