
కరాచీ: పాకిస్తాన్ లో తబ్లిగి జమాత్ కు చెందిన 429 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. సింధ్ ప్రావిన్స్ కు చెందిన వీరంతా పంజాబ్ ప్రావిన్స్ లోని రైవాండ్ లో మత ప్రార్థనలకు అటెండ్ అయినట్లు గుర్తించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తబ్లిగి జమాత్ మెంబర్లను ఐసోలేషన్ లో ఉంచనట్లు సింధ్ చీఫ్ మినిస్టర్ సయ్యద్ మురద్ అలీ షా చెప్పారు. మొత్తం 4,692 మంది తబ్లిగి జమాత్ మెంబర్స్ తమ ప్రాంతంలో ఉన్నారని, 4,653 మందికి టెస్టులు చేసినట్లు తెలిపారు. తబ్లిగి జమాత్ కు చెందినవారు పాకిస్తాన్ తోపాటు ఇండియా, మలేషియా, బ్రూనై లో కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు అధికారులు చెప్పారు. పాకిస్తాన్ లో ఏడున్నర వేల మందికిపైగా కరోనా సోకగా, 143 మంది మృతి చెందారు. పంజాబ్ ప్రావిన్స్ లోనే అత్యధికంగా 3,300 కరోనా కేసులు నమోదయ్యాయి.