భారత్​ వదిలి వెళ్లనున్న 4 వేల 300 మంది కోటీశ్వరులు

భారత్​ వదిలి వెళ్లనున్న 4 వేల 300 మంది కోటీశ్వరులు

అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ హెన్లీ అండ్​ పార్ట్​నర్స్​ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో సుమారు 4300 మంది మిలియనీర్లు భారత్​ వదిలి వెళ్లనున్నారని అంచనా వేసింది. గత ఏడాది 5100 మంది భారతీయ మిలయనీర్లు విదేశాలకు వలస వెళ్లినట్లుగా ఇదే సంస్థ పేర్కొంది. 

  • చైనా, యూకే తర్వాత మిలియనీర్ల వలసలపరంగా ప్రపంచ వ్యాప్తంగా భారత్​ మూడో స్థానంలో ఉన్నట్లు అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్​ అవతరించింది. ప్రతి ఏడాది భారత్​ నుంచి వేల మంది మిలియనీర్లు వలస వెళ్తుండగా, యూఏఈకి అత్యధికంగా వలస పోతున్నారు.
  • గత దశాబ్దంలో 85 శాతం సంపద వృద్ధితో యూఏఈ ఇంకా కొత్త మిలియనీర్లను తయారు చేస్తూనే ఉన్నది. తద్వారా వలసలు పెరిగినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక పేర్కొంది. వలస వెళ్లే మిలియనీర్లలో చాలా మంది భారత్​లో వ్యాపార ప్రయోజనాలు మాత్రమే కాదు సొం త దేశంలో ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. భారత్​తో కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుందని తెలిపింది.
  • భారతీయ ప్రైవేట్​ బ్యాంకులు, వెల్త్​ మేనేజ్​మెంట్​ ప్లాట్​ఫారమ్​లు, క్లయింట్లకు అవసరమైన పెట్టుబడి సేవలను అందించడానికి యూఏఈలో విస్తరిస్తున్నాయి. ఈ రెండు కూడా ప్రపంచ వైవిధ్యం, విస్తరణ అవసరాలతో భారతీయ క్లయింట్స్​కు సపోర్టును అందిస్తున్నాయి. అదేవిధంగా, ఇతర బ్యాంకులు కూడా యూఏఈలో తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. భారతీయ కుటుంబాలకు పోటీతత్వ సంపద నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. 
  • యూఏఈలో స్థిరపడిన భారతీయ కుటుంబాలకు సంపద నిర్వహణ సేవలను అందించడానికి కోటక్​ మహీంద్రా బ్యాంక్​ 360 వన్​ వెల్త్​ డాట్స్​లో చేరుతున్నాయని, తమ పోటీదారులను కోల్పోకుండా చూసుకుంటారని హెన్లీ నివేదిక పేర్కొంది.