కేరళలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు

కేరళలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు

తిరువనంతపురం: కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేరళలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఒక్క రోజులో కొత్తగా 44 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలిపి కేరళలో ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 107కు చేరింది. ఒమిక్రాన్ సోకిన వారిలో 29 మంది యూఏఈ నుంచి వచ్చిన వారు కాగా.. 23 మంది యూకే నుంచి వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. ఏడుగురికి కాంటాక్ట్ ద్వారా కొత్త వైరస్ వ్యాపించింది. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 37 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా.. 26 కేసులతో తిరువనంతపురం ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఒమిక్రాన్ పేషెంట్లలో ఇప్పటి వరకు ఒక్కరు కోలుకున్నారు.
ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలపై కేరళ సర్కారు ఆంక్షలు విధించింది. కేసుల తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. శబరిమల భక్తులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

For more news...

హీరో విశ్వక్ సేన్ కు కరోనా

రెండేళ్లు పూర్తి చేసుకున్న కరోనా మహమ్మారి