హీరో విశ్వక్ సేన్ కు కరోనా

హీరో విశ్వక్ సేన్ కు కరోనా

‘పాగల్’ సినిమా హీరో విశ్వక్ సేన్ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు కరోనా సోకిందని.. తన వైద్యుడి సూచన మేరకు.. ఐసోలేషన్ లో ఉంటున్నానని ఆయన తెలిపారు. 

‘నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. డాక్టర్ సూచన మేరకు అన్ని సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తూ ఐసోలేషన్ లో ఉంటున్నాను. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ వ్యాప్తిచెందడం దురదృష్టకరం. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి.. జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతుడిని’ అని ట్వీట్ చేశారు. 

విశ్వక్ సేన్ 2017లో విడుదలైన వెళ్లిపోమాకే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 

For More News..

65 ఏళ్ల దరిద్రాన్ని కేసీఆర్ నాయకత్వం ఆరేళ్ళలో తరిమికొట్టింది

కేసీఆర్.. రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా?