65 ఏళ్ల దరిద్రాన్ని కేసీఆర్ నాయకత్వం తరిమికొట్టింది

65 ఏళ్ల దరిద్రాన్ని కేసీఆర్ నాయకత్వం తరిమికొట్టింది

నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ, ఎస్టీ బాలుర ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం బీట్ మార్కెట్లో వెజ్ మరియు నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

‘దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమతుల అభివృద్ధి తెలంగాణలోనే ఉంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఐటీ రంగాల్లో తెలంగాణ దూసుకుపోయేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. ఆర్బీఐ నివేదికలో తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాలో 12వ ర్యాంక్ లో ఉంటే.. ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండడం గర్వకారణం. దేశంలోనే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంది ఒక్క తెలంగాణలోనే. ఉమ్మడి జిల్లాలో 65 ఏళ్ల దరిద్రాన్ని కేసీఆర్ నాయకత్వం ఆరేళ్ళలో పారద్రోలింది. భారతదేశం అబ్బురపోయేలా రూ. 1800 కోట్లతో యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారు. దామరచర్లలో 4వేల మెగావాట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఓ చరిత్ర.  ఐటీ హబ్ తో సాంకేతిక ఫలాలు స్థానిక ద్వితీయ శ్రేణి విద్యార్థులకు కూడా అందనున్నాయి. ఐటీలో టాస్క్ పేరిట ఓ సెంటర్ ను, టీ హబ్ లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందిస్తాం. వచ్చే ఏడాదిన్నరలో నల్గొండ రూపురేఖలు మారనున్నాయి. నల్గొండ ఐటీ హబ్ శంకుస్థాపన రోజే 1600 మందికి ఐటీలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ప్రవాస భారతీయులకు ధన్యవాదాలు’ అని కేటీఆర్ అన్నారు.

ఇటీవల నల్లగొండ  పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట ప్రకారం.. పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి, అధునాతన వసతుల కల్పన కోసం గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 30 కోట్ల నిధులను విడుదల చేసింది. 

గతంలో ఐటీ అంటే తెలియని వారు మంత్రులుగా ఉన్నారు: మంత్రి జగదీష్ రెడ్డి
ఈ ఆరేళ్లలోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.  ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. తెచ్చిన తెలంగాణలో మునుగోడు ఫ్లోరోసిస్ మహమ్మారిని పారద్రోలేలా మిషన్ భగీరథ తీసుకొచ్చారు కేటీఆర్. గతంలో ఐటీ అంటే తెలియని వారు మంత్రులుగా ఉన్నారు. నల్గొండ పట్టణాన్ని సుందరంగా రూపుదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

కాంగ్రెస్, బీజేపీలు ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామా చేస్తా: మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఐటీ హబ్ ను జిల్లాలకు విస్తరించి.. స్థానికులకు ఉద్యోగాలు ఇప్పించడం కేటీఆర్ కే సాధ్యం. ఐటీలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. ఆరేళ్ళలో 3 లక్షల నుంచి ఆరు లక్షల మందికి ఉద్యోగాలు పెరిగాయి.  16 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇచ్చిన లక్ష 32వేల ఉద్యోగాల  కన్నా.. కాంగ్రెస్, బీజేపీలు అవి పాలించే రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా నేను రాజీనామా చేస్తా.

For More News..

కేసీఆర్.. రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా? 

బట్టలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా