ఒక్కరోజే 44 వేల కేసులు..511 మరణాలు

ఒక్కరోజే 44 వేల కేసులు..511 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,059 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 91,39,866 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 511 మంది చనిపోగా… మొత్తం మరణాల సంఖ్య లక్షా 33 వేల 738 కు చేరింది. నిన్న మరో 41,024 కోలుకోగా.. ఇప్పటి వరకూ 85 లక్షల 62 వేల 642 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  4 లక్షల 43 వేల 486 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 8,49,596  టెస్టులు చేయగా… ఇప్పటి వరకూ దేశంలో  13 కోట్ల 25, లక్షల 82 వేల 730 మంది శాంపిల్స్ పరీక్షించారు.