సూపర్ జోడి : కృష్ణ, జయప్రద కాంబినేషన్ లో 45 సినిమాలు

సూపర్ జోడి :  కృష్ణ, జయప్రద కాంబినేషన్ లో 45 సినిమాలు

విజయనిర్మల తరువాత సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాల్లో జయప్రదనే నటించింది. మొత్తం వీరిద్దరి కాంబినేషన్ లో  45 సినిమాలు రూపొందాయి. బాపు దర్శకత్వంలో  విజయా సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్ క్లబ్ మూవీలో వీరిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు.  మొదటిసినిమాతోనే సూపర్ జోడిగా వీరికి ముద్రపడిపోయింది.  దీంతో ఈ జోడినే ఎక్కువగా  రిపీట్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించేవారు.

 

అలా మనవూరి కథ, ఈనాటి బంధం ఏనాటిదో, దొంగలకు దొంగ, అల్లరి బుల్లోడు, ఊరికి మొనగాడు లాంటి విజయవంతమైన చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. కృష్ణ, శ్రీదేవి జంటకు అప్పట్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కృష్ణ, జయప్రద జోడికి కూడా ప్రేక్షకులు జేజేలు కొట్టారు. అయితే ఒకటి రెండు చిత్రాల్లో కృష్ణకు చెల్లెలిగా జయప్రద నటించడం ఆ రోజుల్లో అభిమానులకు నచ్చలేదు. వీరిద్దరూ లోక్సభకు ఎంపీలుగానూ ఎన్నిక కావడం విశేషం.