పనితీరు బాగా లేదని 452 మంది ఉద్యోగులను తీసేసిన్రు

పనితీరు బాగా లేదని 452 మంది ఉద్యోగులను తీసేసిన్రు

బెంగళూరు: పనితీరు బాగా లేదని పేర్కొంటూ ఐటీ సేవల కంపెనీ విప్రో 452 మంది ఫ్రెషర్ల ఉద్యోగాలను తీసేసింది. ట్రెయినింగ్​ ఇచ్చాక నిర్వహించిన ఇంటర్నల్​ టెస్ట్​లో ఫెయిల్​ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.  ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫారమ్ నేషనల్ లెవల్ టాలెంట్ హంట్ (ఎన్​ఎల్​టీహెచ్​) ద్వారా విప్రో భారీ సంఖ్యలో ఫ్రెషర్‌‌లను నియమించుకుంది. 128 నిమిషాల అసెస్‌‌మెంట్ ద్వారా అభ్యర్థి ప్రతిభ, రాతపూర్వక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆన్‌‌లైన్ ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను పరీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు క్వార్టర్​లో (మునుపటి క్వార్టర్​తో పోలిస్తే) విప్రో  హెడ్‌‌కౌంట్ దాదాపు 500 తగ్గింది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కంపెనీ 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని భావించింది. దానికి తగ్గట్టే మొదటి తొమ్మిది నెలల్లో 17,000 మందిని నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్​లో మరో 5,000 మందిని నియమించుకోనున్నట్లు కంపెనీ సిహెచ్‌‌ఆర్‌‌ఓ సౌరభ్ గోవిల్ తెలిపారు. అంటే 22,000 మందిని తీసుకోవాల్సి ఉంటుంది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్​ వల్ల ఐటీ ఎక్స్​పర్టులకు డిమాండ్ ​తగ్గుతున్న నేపథ్యంలో కంపెనీ కొత్త రిక్రూట్​మెంట్లను నిర్వహించడం లేదు సరికదా ఫ్రెషర్లను తొలగించింది. విప్రో మాదిరే గూగుల్​, మైక్రోసాఫ్ట్​, అమెజాన్​వంటివి ఉద్యోగాలను తొలగించే పనిలో ఉన్నాయి.