490 డాక్యుమెంట్లు.. కోటి రూపాయలు.. వడ్డీ వ్యాపారులపై పోలీస్ పంజా

490 డాక్యుమెంట్లు.. కోటి రూపాయలు.. వడ్డీ వ్యాపారులపై పోలీస్ పంజా

అక్రమ వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల దాడులు చేశారు. భారీగా నగదును గుర్తించి సీజ్ చేశారు. 38 కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే సిద్ధిపేట జిల్లాలో అక్రమ వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారలు చేసే వారిపై ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు పోలీసులు.  జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్ ల గా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదును గుర్తించారు. 

రూ. 1 కోటి 21 లక్షల 27 వేల నగదును సీజ్ చేశారు. వడ్డీ వ్యాపారుల నుంచి 70 తులాల బంగారు ఆభరణాలు 13 కేజీల వెండి.. 490 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై  38 కేసులు నమోదు చేశారు.