నల్గొండలో రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

V6 Velugu Posted on Sep 19, 2021

నల్లగొండ జిల్లా  కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద  జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కంటైనర్ ను కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.  వీరిని కామినేని ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే రోడ్డుపై ట్రాఫిక్ జాం కావడంతో ఆగి ఉన్న కారును వెనుకనుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో రెండు ప్రమాదాల్లో మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tagged road accident, 5 dead, nalgonda muthyalamma gudem

Latest Videos

Subscribe Now

More News