లైట్ బీరు తాగితే.. గుండె జబ్బులు రావంట.. కిడ్నీలో రాళ్లు ఉండవంట..!

లైట్ బీరు తాగితే.. గుండె జబ్బులు రావంట.. కిడ్నీలో రాళ్లు ఉండవంట..!

బీర్.. ఆ పేరు వినగానే ఉత్సాహం ఉరకలేస్తుంది కదూ.. అసలే ఎండాకాలం.. చిల్డ్ బీర్ కొడితే ఎంత బాగుండో అనిపిస్తోంది కదా.. బీర్ చాలా ఏళ్లుగా ఎక్కువమంది.. ముఖ్యంగా యువత ఇష్ట పడే మద్యం. పండుగలు, బెస్ట్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు.. లేదా అప్పుడప్పుడు ఒంటరిగా కూడా యూత్ బీర్ కొడుతుంటారు.అయితే మద్యం ఆరోగ్యం హానికరం అని అంటుంటారు. కానీ  వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బీర్ ఆరోగ్యానికి హానికం కాదట. మనం నమ్మకాలకు విరుద్ధంగా బీర్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందట. బీర్ ను అతిగా వాడకుండా.. ఒక గ్లాసు బీర్ తో జీవితాన్ని సులభంగా, ఆనందంగా గడపడానికి సాయపడుతుందట.  

బీర్ తయారీలో ఈస్ట్, హాప్ లు, తృణధాన్యాలతో తయారు చేయడం, వాటిని పులియ బెట్టడం ద్వారా బీర్ తయారు చేస్తారు. ఒక బీర్ క్యాన్ లో ఆల్కహాల్ గాఢతన 4-6 శాతం మాత్రమే ఉంటుంది. ఇందులో 40శాతం  వరకు పోషకాలు గల పానియం ఉంటుంది. దీనిలో ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. బీర్ మితంగా వినియోగించినప్పుడు ఆరోగ్యానికి సహాయపడుతుంది బేవరేజెస్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. బీర్ తాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలను తెలుసుకుందాం.. 

గుండెకు ఆరోగ్యాన్ని.. 

బీర్ అనేది గుండెకు ఆరోగ్య కరమైన ఆల్కహాలిక్ పానియం. బీర్ తీసుకోని వారితో పోలిస్తే బీర్ తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 42 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే బీర్ మితంగా తీసుకుంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. 5 శాతం ఆల్కహాల్ తీసుకోవండం మంచి వినియోగం అని .. ఆరోగ్యం అని చెపుతున్నారు. 

బ్లడ్ షుగర్ నియంత్రణ 

చాలా మందికి రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) ఓ సాధారణ సమస్య అయింది. మితమైన బీర్ వినియోగం వల్ల రక్తంలో చక్కెర  లెవెల్స్ ను నియంత్రణలో ఉంచొచ్చు. బీర్ వినియోగం డయాబెటిస్ కు ప్రమాదకరం అయినా ఇన్సులిన్ నియంత్రణకు పనిచేస్తుందన అధ్యయనాలు చెపుతున్నాయి. అయితే చక్కెర తో కూడిన ఆల్కహాలిక్ బీర్ పానియాలను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. 

కిడ్నీ స్టోన్స్ 

మూత్రనాళ వ్యవస్థలోఅదనపు కాల్షియం నిల్వల నిరోధించడంలో మితమైన బీర్ వినియోగం సహాయ పడుతుంది. ఇది అధిక మూత్ర ఉత్పత్తి, మూత్ర నాళాలను విస్తరింపజేసి మూత్ర పిండాల రాళ్లను నొప్పి లేకుండా ఫ్లష్ చేస్తుంది. అయితే ఇక్కడో పెద్ద సమస్య ఉంది. అధికంగా బీర్ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయి. కాబట్టి బీర్ వినియోగం మితంగా ఉండాలి. 

క్రియేటివిటీని పెంచుతుంది 

బీర్ తాగితే క్రియేటివిటీ పెరుగుతుందట. కాన్షియస్ నెస్ అండ్ కాగ్నిషన్ అనే జర్నల్ చేసిన ఓ అధ్యయనంలో బీర్ సేవించే పురుషులు , సాధారణ పురుషులకంటే వేగంగా శబ్ధ పజిల్ లను పరిష్కరించగలరని తేలింది. ఇది సమస్యల పరిష్కార నైపుణ్యాలను మెరుగు పర్చే నమ్మకం స్థాయిని గణనీయంగా పెంచుతుందట. 

సో.. బీర్ తాగితే మంచిదే.. కానీ అధికంగా తాగితే ఆరోగ్యానికి ప్రమాదమే.. జాగ్రత్త వహించాలి.