ఆయుష్మాన్​కార్డుతో రూ.5 లక్షల బీమా : కమల్​వర్ధన్​ రావు

ఆయుష్మాన్​కార్డుతో రూ.5 లక్షల బీమా : కమల్​వర్ధన్​ రావు
  •     ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కమల్ వర్ధన్​రావు

కంది/పటాన్​చెరు, వెలుగు : ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్​ కార్డు తీసుకొని రూ. 5 లక్షల బీమా పొందాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కమల్​వర్ధన్​ రావు తెలిపారు. ఆదివారం సంగారెడ్డి, కంది మండలంలోని ఆరుట్ల, పటాన్​చెరు మండల పరిధిలోని భానూర్​, కర్ధనూర్​గ్రామాల్లో  వికసిత్​భారత్​సంకల్ప్​యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని పొగాకు దూరంగా ఉండాలని ఉప్పు చక్కెరలు తగ్గించాలని సూచించారు.

కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్షయ వ్యాధి నియంత్రణ సంయుక్త సంచాలకులు డాక్టర్ రాజేశం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిడాక్టర్ గాయత్రీ దేవి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశ్వరి, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఇబ్రహీం, డిప్యూటీ డీఎంఎం డాక్టర్ నాగనిర్మల, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మనోహర్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీరామ్, సుధాకర్ పాల్గొన్నారు