రూ.175 కోట్ల హెరాయిన్.. ఐదుగురు పాకిస్తానీయులు అరెస్ట్

రూ.175 కోట్ల హెరాయిన్.. ఐదుగురు పాకిస్తానీయులు అరెస్ట్

రూ.175 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు పాకిస్తానీయుల్ని పట్టుకున్నారు గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ అధికారులు.  గుజరాత్ తీరం నుండి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) సహయంతో ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కోట్ల విలువ చేసే హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు.

గుజరాత్ సముద్ర మార్గం ద్వారా  మత్తుపదార్థాలను దేశంలోకి తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు  ప్రయత్నిస్తున్నారని  గుజరాత్ ఎటిఎస్ డిఐజి హిమాన్షు శుక్లా మీడియాతో అన్నారు.”రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలను తాము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, 1600 కిలోమీటర్ల సముద్ర తీరం వెంబడి భద్రతా చర్యలకై ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామన్నారు.”

5 Pakistan nationals with heroin worth Rs.175 cr. nabbed off Gujarat coast