ఆఫర్..ఆఫర్..రూ. 12 వేల ఫోన్ కేవలం రూ. 6వేలకే

 ఆఫర్..ఆఫర్..రూ. 12 వేల ఫోన్ కేవలం రూ. 6వేలకే

అమెజాన్లో టెక్నో డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో సెల్ ఫోన్లు  భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ సేల్ లో టెక్నో ఫోన్ లపై 50 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సేల్ ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వివరాలు తెలుసుకుందాం రండి. 

వినియోగదారులకు అమెజాన్ ఈ ఆఫర్ లో టెక్నో ఫోన్లపై 15 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తుంది.TECNO Pop 8  ఫోన్ పై 15 శాతం తగ్గింపును అందిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 7,799 కాగా.. రూ. 6,599 లకు కొనుగోలు చేయొచ్చు. ఫోన్ లో ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఎక్ఛేంజ్ ఆఫర్ తర్వాత దీని ధర రూ. 6,250. ఈ ఫోన్ లో  5000 mAh బ్యాటరీ ఉంటుంది. డైనమిక్ ఫోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకత. 

అమెజాన్ కస్టమర్లకు మంచి డిస్కౌంట్ తో అందిస్తున్న మరో ఫోన్Techno Powa 5 Pro 5G ..ఈ ఫోన్  24 శాతం డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 20,999 ఉంది.. డిస్కౌంట్ తో రూ. 15,999 కి లభిస్తోంది. కూపన్ తో  ఈఫోన్ పై మరో రూ. 1500 తగ్గింపు ఉంటుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద దీనిపై అదనపు తగ్గింపులను పొందవచ్చు. 
Techno Spark Go 2024 ని 14 శాతం తగ్గింపుతో లభిస్తుంది.దీని ధర ప్రస్తుతం 8,499 ఉంది. డిస్కౌంట్  తర్వాత ఇది రూ.7,299 కి లభిస్తుంది. ఈ ఫోన్ లో ప్రత్యేకత ఏమిటంటే.. డైనమిక్ పోర్ట్, డ్యూయల్ స్పీకర్లు. 

అమెజాన్ డిస్కౌంట్ తో అందిస్తున్న మరో ఫోన్ ..Techno Spark Go 2024.  దీనిని కస్టమర్లు  11 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫఓన్ ను కస్టమర్లు సేల్ నుంచి రూ. 7,999కి బదులుగా రూ. 7,099 లకు లభిస్తుంది.ఈ ఫోన్ పై ఎక్చేంజ్ ఆఫర్ తో మరికొంత తగ్గింపు ఉంది. 

ఇక 50 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్న ఫోన్ Techno Spark 9. ఈ ఫోన్ ప్రస్తుత ధర రూ. 11,499 కాగా.. దీనిని డిస్కౌంట్ తర్వాత రూ. 5,999 కి లభిస్తోంది. ఈ ఫోన్ ను ఎక్ఛేంజ్ ఆఫర్ లో కొనుగోలు చేసినట్లయితే కస్టమర్లకు రూ. 5,600 తగ్గింపు లభిస్తుంది.