దారి దోపిడీలకు పాల్పడుతున్న.. ఐదుగురు హిజ్రాలు అరెస్ట్

దారి దోపిడీలకు పాల్పడుతున్న.. ఐదుగురు హిజ్రాలు అరెస్ట్

చౌటుప్పల్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో దాడి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్​చేశారు. వారికి సహకరిస్తున్న ఇద్దరు కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం చౌటుప్పల్ ఏసీపీ ఆఫీసులో ఏసీపీ మొగులయ్య వివరాలు వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన మందలా శ్రావణి అలియాస్ సునీల్, దాలయి రజిత అలియాస్ పాండు, నడిపుడి మాలవిక అలియాస్ మధు, కందిపల్లి స్వర్ణ అలియాస్ భాను, కర్రి పద్మ అలియాస్ మూర్తి కారు డ్రైవర్లు పశ్వాన్ సాగర్, సానబోయిన దినేశ్​తో కలిసి ఈజీ మనీ కోసం దారి దోపిడీలు చేస్తున్నారు. నేషనల్​హైవేపై వెళ్తున్న మగవారిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు.

వారి మెడలోని బంగారంతోపాటు డబ్బులు కాజేస్తున్నారు. ఈ నెల 11న సాయంత్రం చౌటుప్పల్ కు చెందిన ఊదరి రమేశ్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా హైవేపై ఆపారు. బలవంతంగా 1.5తులాల గోల్డ్​చైన్​లాక్కుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అదే టైంలో అటుగా వచ్చిన హిజ్రాలు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దారి దోపిడీలు బయటపడ్డాయి. వారి నుంచి 1.5తులాల గోల్డ్​చైన్, షిఫ్ట్ కారు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితలను రిమాండ్ తరలించినట్టు ఏసీపీ వెల్లడించారు.