అమృత్‌‌‌‌‌‌‌‌కాల్‌‌‌‌‌‌‌‌లో భారత్ ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లకు..

అమృత్‌‌‌‌‌‌‌‌కాల్‌‌‌‌‌‌‌‌లో భారత్ ఎకానమీ 5 ట్రిలియన్ డాలర్లకు..
  •  ప్రకటించిన కేంద్ర ఆర్థికశాఖ

 న్యూఢిల్లీ :  మనదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, 'అమృత్ కాల్' ప్రారంభంలో భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం తెలిపారు.  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​) కూడా భారతదేశం 2027–-28లో  ఐదు ట్రిలియన్​డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా వేసింది. స్థూల ఆర్థిక స్థిరత్వం వల్ల బలపడే రూపాయి సహాయంతో ఈ టార్గెట్​ను అందుకుంటామని ఆయన లోక్‌‌‌‌‌‌‌‌సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు.  2022–-23 చివరి నాటికి, భారత జీడీపీ  3.7 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లకు చేరింది.

1980–-81లో, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం189 బిలియన్ డాలర్లు కాగా, ఇది ఒక దశాబ్దం తర్వాత 326 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2000–-01 సంవత్సరంలో 476 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2010–-11లో  భారతదేశపు జీడీపీ 1.71 ట్రిలియన్​ డాలర్లకు, 2020–-21లో  2.67 ట్రిలియన్​ డాలర్లకు పెరిగింది.   2022–-23లో నామమాత్రపు జీడీపీకి వ్యవసాయం, పరిశ్రమలు  సేవల సహకారం వరుసగా 18.4 శాతం, 28.3 శాతం,  53.3 శాతంగా ఉందని చౌదరి చెప్పారు.