
కోల్‌కతా: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడు కరోనా వైరస్‌ను జయించడం అందరిలో ధైర్యం నింపుతోంది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లోని పురాలియా జిల్లాలో జరిగింది. శత్రుఘన్ సింగ్ సర్దార్, గురువారి సింగ్ సర్దార్‌ది పేద కుటుంబం. వీరి నాలుగో కొడుకు గత నాలుగున్నర ఏళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కోల్‌కతాలోని క్యాన్సర్ ఆస్పత్రిలో అతడికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. అయితే గత నెల 30న నిర్వహించిన టెస్టుల్లో సదరు బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో భయపడిన తల్లి గురువారి.. కొడుకు తమకు దక్కడేమోనని దిగులు పడింది. అయితే ఆందోళన చెందొద్దని ఆమెకు డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది నచ్చజెప్పారు. ఆ తర్వాత సదరు బాలుడ్ని కలకత్తా మెడికల్ కాలేజీలో చేర్చారు. ట్రీట్‌మెంట్ అనంతరం కరోనా నుంచి కోలుకున్న సదరు బాలుడ్ని ఈ నెల 15న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పిల్లాడితోపాటు తల్లి గురువారి రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండనున్నారు. కరోనాను జయించిన సదరు బాలుడికి భోజనంతోపాటు బొమ్మలనూ అందిస్తామని లోకల్ పోలీస్ స్టేషన్ తెలిపింది.