కరోనా మృతుల కుటుంబాలకు  50 వేల పరిహారం

కరోనా మృతుల కుటుంబాలకు  50 వేల పరిహారం
  • సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ 

న్యూఢిల్లీ: కరోనా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లిస్తాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే కరోనాతో చనిపోయినోళ్ల కుటుంబాలతో పాటు భవిష్యత్తులో కరోనాతో మరణించినా పరిహారం ఇస్తాయని చెప్పింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ నుంచి ఈ మొత్తం చెల్లిస్తాయంది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ పరిహారం అమల్లో ఉంటుందంది. బుధవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కరోనా సహాయక చర్యల్లో పాల్గొని చనిపోయినోళ్ల కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లిస్తాయని వెల్లడించింది. కరోనా వల్లనే చనిపోయారనే సర్టిఫికెట్ ఉండాలని తెలిపింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని జూన్ లో కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. గైడ్ లైన్స్ కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీకి ఆరు వారాల టైమ్ ఇచ్చింది.  
నెల రోజుల్లోగా...  
‘‘పరిహారం కోసం బాధిత ఫ్యామిలీలు క్లెయిమ్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫామ్స్ నింపి, డాక్యుమెంట్లు జత చేయాలి. జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు వాటిని పరిశీలించి, 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఆధార్ లింక్ ద్వారా ఫ్యామిలీ ఖాతాలో డబ్బులు వేయాలి” అని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. దరఖాస్తులో ఏవైనా సమస్యలుంటే జిల్లా లెవల్ కమిటీ పరిష్కరిస్తుందని చెప్పింది. కమిటీలో అడిషనల్ కలెక్టర్, చీఫ్ ​మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంఓహెచ్), అడిషనల్ సీఎంఓహెచ్ గానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లేదా కాలేజీలోని మెడిసిన్ డిపార్ట్ మెంట్ హెడ్ గానీ, సబ్జెక్టు ఎక్స్ పర్ట్ ఉంటారని తెలిపింది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి పరిహారం తిరస్కరిస్తే, గల కారణాలను రికార్డు చేయాలంది. 


4.45 లక్షల మంది మృతులు
కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 4.45 లక్షల మందికి పైగా చనిపోయారు. కొన్ని రాష్ట్రాలు కరోనా మృతుల ఫ్యామిలీలకు ఇప్పటికే పరిహారం ప్రకటించాయి. బీహార్ రూ.4 లక్షలు, మధ్యప్రదేశ్ రూ.లక్ష, ఢిల్లీ రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నాయి.

రాష్ట్రంలో 258 కేసులు.. 
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో మరో 258 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించింది. బుధవారం 55,419 మందికి టెస్టులు చేయగా.. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 69 మందికి, జిల్లాల్లో 189 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. కరోనాతో బుధవారం మరొకరు చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 3,908కి పెరిగిందని బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.