నంద్యాల జిల్లా: వెలుగోడు జలాశయంలో 500 ఆవులు కొట్టుకుపోయాయి. అడవిపందులు తరమడం వల్లే ఆవులు వాగులో పడ్డట్లు తెలుస్తోంది. నీటిలో కొట్టుకుపోతున్న 350 ఆవులను స్థానికులు రక్షించారు. మిగతా 150 ఆవుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు గ్రామాల్లోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎప్పటిలాగే అడవిలోకి ఆవులను మేతకు తీసుకెళ్లగా.. వర్షం ఎక్కువ కావడంతో ఆవులు, దూడలు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయని తెలుస్తోంది.
