సముద్ర గర్భంలో 500 ఏళ్ల నాటి  నిధి... పురాతన ఓడల్లో లక్షల కోట్ల సంపద

సముద్ర గర్భంలో 500 ఏళ్ల నాటి  నిధి...   పురాతన ఓడల్లో లక్షల కోట్ల సంపద

దక్షిణ చైనా సముద్రంలో 500 ఏళ్ల నాటి షిప్ బ్రెక్ ను అక్కడి అధికారులు కనుగొన్నారు.  ఈ పురాతన ఓడలో లక్షల కోట్ల విలువైన  పింగాణి, బంగారు  వస్తువులతో కూడిని నిధి ఉందని  చైనా పరిశోధకులు తెలిపారు. సముద్రానికి వాయువ్య దిశలో  10 నాటికల్ మైళ్ల దూరంలో  ఒక మైలు లోతులో పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ విషయాన్ని  చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్  సముద్రపు పురావస్తు శాఖ ప్రకటించింది.

చైనా పూర్వీకులు దక్షిణ చైనా సముద్రాన్ని అభివృద్ధి చేసి, ఉపయోగించుకొని దాని ద్వారా  ప్రయాణించారని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ వద్ద ఆర్కియాలజీ డైరెక్టర్ యాన్ యాలిన్ అన్నారు. సాంస్కృతిక అవశేషాలు మునిగిపోయిన ఓడ నుంచి బయటకు వచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిలో లక్ష  పింగాణీ వస్తువులు పదివేల చదరపు మైళ్లలో పడిఉన్నాయి. సముద్ర ప్రాంతంలో ప్రయాణించి తిరిగి వస్తున్న పురాతన నౌకలు దేశంలో కనుగొనడం ఇదే మొదటిసారని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్  తెలిపారు. 

చైనీస్ పూర్వీకులు దక్షిణ చైనా సముద్రాన్ని అభివృద్ధి చేసి, ఉపయోగించుకున్నారని  పురావస్తు డైరెక్టర్ యాన్ యాలిన్ అన్నారు. ఇది లోతైన సముద్రంలో ప్రపంచ స్థాయి పురావస్తు ఆవిష్కరణ కావచ్చని  యాన్ చెప్పారు. మునిగిన ఓడలలో ఒకటి ప్రధానంగా పింగాణీ వస్తువులను మరొక దానిలో  కలపతో తయారు చేసిన విలువైన వస్తువులను గుర్తించారు.  ఇవి   మింగ్ రాజవంశం జెంగ్డే కాలం (1506 - 1521)  నాటివని భావిస్తున్నారు.  మరికొన్ని ఓడల్లో చక్కగా పేర్చబడిన అనేక లాగ్ లు కనుగొన్నారు.   ఓడలోని కొన్ని వస్తువులు బహుశా హాంగ్జీ చక్రవర్తి (1488-1505) కాలం నాటివి కావచ్చని చెబుతున్నారు. ఇవి  విదేశాల  చైనాకు  వస్తువులు తీసుకొచ్చేటప్పుడు పురాతన ఓడలు  ప్రమాదానికి గురయ్యాయని   సముద్రపు పురావస్తు శాఖ  అధికారులు తెలిపారు.