స్వామియే శరణం : అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీ.. ఆన్ లైన్ దర్శనం టికెట్లు

స్వామియే శరణం : అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీ.. ఆన్ లైన్ దర్శనం టికెట్లు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది శబరిమల ఆలయ కమిటీ. ఇకపై రోజుకు 50వేల మందిని వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా టికెట్లను ఆన్లైన్లో కేటాయించనున్నామని, వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకునే అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించనున్నామని  తెలిపారు అధికారులు. ఇన్సూరెన్స్ పాలసీ కోసం బుకింగ్ సమయంలో భక్తుల నుండి కేవలం రూ.10 వాసులు చేయనున్నామని తెలిపారు. ఈ పద్దతి ద్వారా ఒకేసారి 25వేల మంది భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

మొదట్లో 80వేల మంది భక్తులను అనుమతించాలని భావించినప్పటికీ మాస పూజకు ఉన్న పరిమితుల వల్ల 50వేల మందికే పరిమితం చేశామని తెలిపారు అధికారులు. శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇన్సూరెన్స్ కవరేజ్ ని పెంచే దిశగా కంపెనీలతో చర్చిస్తామని అన్నారు అధికారులు.