కరీంనగర్​లో 53.. పెద్దపల్లికి 63 నామినేషన్లు

కరీంనగర్​లో 53.. పెద్దపల్లికి 63 నామినేషన్లు
  • భారీగా నామినేషన్లు
  • ముగిసిన నామినేషన్లు
  • కరీంనగర్​లో ఇండిపెండెంట్లే 34 మంది 

కరీంనగర్/ పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్థానాల్లో  గురువారంతో నామినేషన్ల  స్వీకరణ గడువు ముగిసింది. కరీంనగర్ ఎంపీ స్థానానికి మొత్తం 53 మంది అభ్యర్థులు 94 సెట్లు దాఖలు కాగా.. పెద్దపల్లి స్థానానికి 63 మంది అభ్యర్థులు 109 సెట్ల నామినేషన్లు సమర్పించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి రోజు 27 మంది అభ్యర్థులు 32 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 

పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ(కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్(బీజేపీ), కొప్పుల ఈశ్వర్(బీఆర్ఎస్) నామినేషన్లు సమర్పించగా, కరీంనగర్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్థానంలో వెలిచాల రాజేందర్ రావు(కాంగ్రెస్), బండి సంజయ్(బీజేపీ), వినోద్ కుమార్(బీఆర్ఎస్) నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ లో వీరితోపాటు వెలిచాల రేఖ(కాంగ్రెస్), అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి(కాంగ్రెస్), మీసాల రాజారెడ్డి(కాంగ్రెస్), చింత అనిల్ కుమార్(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), తాళ్లపల్లి అరుణ(ఆధార్ పార్టీ), రాణాప్రతాప్ (సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా), చిలువేరు శ్రీకాంత్(ధర్మ సమాజ్ పార్టీ), శ్రీనివాసరెడ్డి(ఎంసీపీఐ), పంచిక అశోక్(సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా), అనిల్ రెడ్డి( నేషనల్ నవక్రాంతి పార్టీ), వరుణ్ కుమార్ గుప్తా(తెలుగు కాంగ్రెస్ పార్టీ), పెద్దపల్లి శ్రావణ్(భారతీయ యువకుల దళం పార్టీ), పొడిశెట్టి సమ్మయ్య(బహుజన ముక్తి పార్టీ), మారేపల్లి మొగిలయ్య(బీఎస్పీ), మాతంగి హనుమయ్య(దళిత బహుజన పార్టీ) నామినేషన్లు సమర్పించారు.  ఇండిపెండెంట్లుగా మరో 34 మంది నామినేషన్ వేశారు. వచ్చిన నామినేషన్లను శుక్రవారం స్క్రూటినీ చేయనున్నారు. 

 నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42 మంది.. 

జగిత్యాల, వెలుగు: నిజామాబాద్ స్థానంలో 42 అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు 28 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. టి.జీవన్ రెడ్డి(కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌( బీజేపీ) నామినేషన్లు దాఖలు చేశారు. మరో 39 మంది వివిధ రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు, ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు.