5.38 కోట్లకు రాజన్న గుడి హక్కుల వేలం

5.38 కోట్లకు రాజన్న గుడి హక్కుల వేలం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వివిధ హక్కుల వేలం ద్వారా రూ. 5,38,75,000 ఆదాయం వచ్చింది. దేవస్థానంలో భక్తులకు బెల్లం, పూజ సామగ్రి విక్రయించేందుకు గతంలో రూ. 1.7 కోట్లు ఉండగా వేలంలో ఇద్దరు పాల్గొనగా సీల్డ్​కవర్​లో  ​ముగ్గురు టెండర్లు వేశారు. కుసుమ అనిల్​రూ.1,87,20,000కు హక్కులు దక్కించుకున్నారు. ప్రధాన దేవాలయంలో కొబ్బరి ముక్కలు పొందేందుకు గతంలో రూ. 1.11 కోట్లు ఉండగా రూ.1.1 కోట్లకు పులి రవికుమార్​ గౌడ్, అనుబంధ ఆలయంలో కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు గతంలో రూ.65.55 లక్షలు ఉండగా పులి రవికుమార్​గౌడ్​రూ.81.55 లక్షలకు, ప్రధాన దేవాలయం, అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన ఓడి బియ్యం పొందేందుకు గతంలో రూ. 48.8 లక్షలు ఉండగా రూ. 1.35 కోట్లకు ఎం. నరేశ్, దేవాలయం బిల్డింగ్​లో వ్యాపార నిర్వహణకు గతంలో రూ. 15 లక్షలు ఉండగా రూ. 25 లక్షలకు గోరంట్ల స్పప్న హక్కులను దక్కించుకున్నారు. 2023 జనవరి 7 నుంచి రెండేళ్ల వరకు టెండర్​దక్కించుకున్నవారికి హక్కు ఉంటుంది. కార్యక్రమంలో ఈవో కృష్ణప్రసాద్, డీఈ రఘునందన్, సూపరింటెండెంట్లు గోలి శ్రీనివాస్, శ్రీరాములు, రవీందర్​, నరేందర్​ పాల్గొన్నారు.