
న్యూఢిల్లీ: ఐపీఎల్–15వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముంబైలో 55 లీగ్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లను షెడ్యూల్ చేయనున్నారు. అదేటైమ్‌లో రిలయన్స్ స్టేడియాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో 15 గ్రూప్ మ్యాచ్‌లు జరిగే చాన్సుంది. మార్చి 26న లీగ్‌ను స్టార్ట్ చేసి మే 29న ఫైనల్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై గురువారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో తుది నిర్ణయం వచ్చే చాన్సుంది.