షెల్టర్ హోంలో 57 మంది అమ్మాయిలకు కరోనా.. ఐదుగురు మైనర్లకు ప్రెగ్నెన్సీ

షెల్టర్ హోంలో 57 మంది అమ్మాయిలకు కరోనా.. ఐదుగురు మైనర్లకు ప్రెగ్నెన్సీ

కాన్పూర్ షెల్టర్ హోంలో కలకలం
57 మంది అమ్మాయిలకు కరోనా
ఐదుగురు మైనర్లకు ప్రెగ్నెన్సీ, ఒకరికి హెచ్ఐవీ

కాన్పూర్: బాల నేరస్థుల కోసం యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కాన్పూర్ జిల్లాలోని షెల్టర్ హోంలో 57 మంది బాలికలకు కరోనా సోకినట్లు టెస్టుల్లో బయటపడింది. ఒకరికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు కన్ఫామ్ కాగా.. మరో ఐదుగురు అమ్మాయిలు ప్రెగ్నెంట్స్ అని తేలడం కలకలం రేపింది. దీంతో షెల్టర్ హోంను సీజ్ చేసిన జిల్లా కలెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు.

షెల్టర్ హోంకి వచ్చేనాటికే వాళ్లు ప్రెగ్నెంట్స్‌
షెల్టర్ హోంలో అమ్మాయిలు ప్రెగ్నెన్సీతో ఉన్నారన్న ఘటనపై కాంట్రవర్సీ వచ్చిన నేపథ్యంలో కాన్పూర్ జిల్లా కలెక్టర్‌‌ బ్రహ్మదేవ్‌ క్లారిటీ ఇచ్చారు. ఫోక్సో చట్టం కింద అరెస్టయిన ఏడుగురు మైనర్ అమ్మాయిలు షెల్టర్ హోంకు వచ్చే నాటికే గర్భిణులు అని చెప్పారు. వారిలో ఐదుగురికి కరోనా సోకిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని కాంటాక్ట్ అయిన ఒక స్టాఫ్ ద్వారా షెల్టర్ హోం బాలికలకు వైరస్ ఎటాక్ అయిందన్నారు. వైరస్ బారిన పడిన వారిని ఐసోలేషన్‌కు తరలించి, మిగతావారని క్వారంటైన్ సెంటర్లలో ఉంచినట్లు తెలిపారు. కాన్పూర్ పోలీస్ కమిషనర్ సుధీర్ మహాదేవ్ కూడా మైనర్లలో ఒకరు హెచ్ఐవి పాజిటివ్ అని ధృవీకరించారు. ఈ ఘటనలో షెల్టర్ హోం అధికారులను విచారిస్తామని చెప్పారు. ఈఘటనపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ స్పందించారు. ఇప్పటికే ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసు గురించి దేశమంతా తెలుసునని, ప్రస్తుతం కాన్పూర్ షెల్టర్ హోం విషయంలోనూ దర్యాప్తు పేరిట నిజాలు అణిచివేస్తారని యూపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. షెల్టర్ హోంలో
బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు పట్టించుకోలేదు కాబట్టే..
షెల్టర్ హోం అధికారుల లోపాలు ఇన్వెస్టిగేషన్ లో బయటపడినట్లు ఒక సీనియర్ అధికారి సోమవారం మీడియాకు వెల్లడించారు. షెల్టర్‌‌ హోంలో ఈ నెల 15వ తేదీన మొదటి కరోనా కేసు నమోదైన తర్వాత షెల్టర్ హోంకు అధికారులు ఎలాంటి ముద్రవేయలేదు. పైగా 100 మంది కెపాసిటీ ఉన్న ఆ బిల్డింగ్ లో 171 మందిని ఉంచారని తేలింది. మొదటి కరోనా కేసు నమోదైన వెంటనే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. దీంతో రెండ్రోజుల్లోనే 33 మంది అమ్మాయిలకు.. జూన్ 19 నాటికి ఇంకో 16 మంది బాలికలకు వైరస్ అంటుకుందని చెప్పారు. ఆ మరుసటి రోజు జరిపిన టెస్టుల్లో మరో ఎనిమిది మంది బాలికలకు కరోనా ఉన్నట్లు తేలిందన్నారు.

For More News..

కిరాణా కొట్టు బాకీలు వసూల్ చేసిన వ్యక్తే.. స్టేట్ బ్యాంక్ రికవరీ హెడ్

పాక్‌ టీమ్‌లో ముగ్గురికి కరోనా

ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌ రికార్డు

లాక్‌‌డౌన్ సడలించినా షాపింగ్ చేయట్లే..