ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా వందలోపే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 10వేల 914 కరోనా పరీక్షలు నిర్వహించగా 59మందికి పాజిటివ్ గా అని నిర్ధారణ అయ్యింది. అయితే కోవిడ్ వల్ల రాష్ట్రంలో 24 గంటల్లో ఒక్కరు కూడా మృతి చెందలేదు. మరో 83మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నేటివరకు 23,18,943 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,03,690 మంది వైరస్ నుంచి విజయవంతంగా కోలుకున్నారు. మరోవైపు ఏపీలో ఇంకా 523 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి 14వేల 730 మంది మరణించారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 3,32,78,495 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
