సెలవుల్ని ఇలా ప్లాన్ చేసుకుంటున్నారట

సెలవుల్ని ఇలా ప్లాన్ చేసుకుంటున్నారట

ఇప్పటి యువత సెలవు రోజుల్లో రొటీన్‌‌గా ఉండే పనులు కాకుండా, కొంచెం కొత్తగా ఉండే పనులు చేయడానికి ఇంట్రెస్ట్‌‌ చూపెడుతున్నారని రీసెర్చ్‌‌లో తేలింది. యూనివర్సిటీ ఆఫ్‌‌ చికాగోకు చెందిన రీసెర్చర్లు ఈడీ ఓబ్రీన్‌‌, యూజి కట్సుమాతా వైనెట్‌‌ అనే రీసెర్చర్లు ఈ స్టడీ చేశారు.

సెలవు రోజులను ఎలా ప్లాన్ చేసుకుంటారు అనే విషయం మీద ప్రపంచవ్యాప్తంగా 6,000 మందిని సర్వే చేశారు. వాళ్లలో 67 శాతం మంది ఉన్న సెలవులన్నీ కొత్తగా గడపడానికి ప్లాన్ చేసుకుంటే, 33 శాతం మంది చివరి రోజు కొత్తగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. దీనంతటికి కారణం వర్క్‌‌ ప్రెజర్‌‌‌‌, లైఫ్‌‌లో, కాలేజీల్లో రొటీన్‌‌ లైఫ్‌‌ స్టైల్‌‌కి అలవాటు పడటమని రీసెర్చ్‌‌లో తేలింది. వీటినుంచి మైండ్‌‌కి కొంత రిలీఫ్‌‌ ఇవ్వడానికి కొత్తదనాన్ని ఎంచుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇది జనాల సైకాలజీ, ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుందని అంటున్నారు రీసెర్చర్లు. కొత్తదనాన్ని కోరుకున్నవాళ్లు ఆరోగ్యంగా, పనిలో చురుకుగా ఉంటారని తేలింది.