బొల్లారంలో బీఆర్ఎస్​కు షాక్

బొల్లారంలో బీఆర్ఎస్​కు షాక్

జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, ఓ కో ఆప్షన్ మెంబర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం బొల్లారం మున్సిపాలిటీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నేత చంద్రారెడ్డి తన వర్గీయులైన కౌన్సిలర్లు సంతోష, గోపాలమ్మ, నిహారిక, చంద్రయ్య, జయమ్మ, కోఆప్షన్ మెంబర్​మునీర్ తో కలిసి వేయి మంది కార్యకర్తలతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో హైదరాబాద్​లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీప్​ దాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

చంద్రారెడ్డి మాట్లాడుతూ తనను నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తల కోసమే పార్టీ మారుతున్నట్లు తెలిపారు. 2014 నుంచి బీఆర్ఎస్ లో కార్యకర్తగా, నాయకుడిగా ప్రజాసేవ చేస్తున్నానని కానీ, పార్టీ ఎన్నడూ తనకు అండగా నిలబడలేదని వాపోయారు. అటు అభివృద్ధి విషయంలో, ఇటు కార్యకర్తల విషయంలో అన్యాయం చేసిందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి,  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.