
పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఓ కారు అదుపు తప్పి కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంబర్ జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఆదివారం రాత్రి 11.30 గంటలకు దంకౌర్ ప్రాంతం వద్ద కారు ఖేర్లీ కాలువలో పడింది. మారుతి ఎర్టిగాలో మొత్తం 11 మంది ఉన్నారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆరుగురు చనిపోగా ఐదుగురు చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతులు మహేష్ (35), కిషన్లాల్ (50), నీరేష్ (17), రామ్ ఖిలాడి (75), మల్లు (12), నేత్రపాల్ (40) గా గుర్తించారు.