ఆరు గ్యారంటీలపై ఫెక్ ఐడి కార్డులు.. వీ6 కథనంతో పోలీసుల విచారణ

ఆరు గ్యారంటీలపై ఫెక్ ఐడి కార్డులు.. వీ6 కథనంతో పోలీసుల విచారణ

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల ఫేక్ ఐడి కార్డులతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నట్లు  v6 ఛానెల్ లో వచ్చిన వార్తకు స్పందించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మీ సేవాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలకు సంబంధించి ఫెక్ ఐడి కార్డులను ప్రింట్ చేసి 100 నుండి 500 వరకు అమ్ముతున్న వ్యవహారంపై v6 ఛానెల్ వెలుగులోకి తీసుకొచ్చింది. v6 లో కథనం చూసి షాద్ నగర్ కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ  పిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. 

 షాద్ నగర్ సిఐ ప్రతాప్ లింగం మాట్లాడుతూ.. పట్టణంలోని మీ సేవాల్లో నకిలీ ఐడి కార్డులు ప్రింట్ చేసి అమ్ముతున్నట్లు పిర్యాదు అందిందని.. ఈ ఫిర్యాదుపై విచారణ చేయగా ఆన్లైన్ లో ఒక నకిలీ సైట్ లో ఈ కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మీ సేవా నిర్వాహకులను పిలిచి విచారిస్తున్నామని, ఈ తరహా సైట్ తెలంగాణ మొత్తం వస్తున్నట్లు, సైట్ లో నియోజిజవర్గం ఎమ్మెల్యే  ఫొటోతో పాటు వస్తున్నట్లు గమనించామన్నారు. సైట్ పై సైబర్ టీం పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ తరహా సైట్లను ప్రజలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలని సిఐ తెలిపారు.