ఈవారం 6 ఐపీఓలు..

ఈవారం 6 ఐపీఓలు..

న్యూఢిల్లీ:  ఐపీఓ​ మార్కెట్ 2023 చివరివారంలోనూ బిజీగా ఉండబోతోంది. ఈవారం ఆరు కొత్త ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  పది కొత్త లిస్టింగ్స్​ఉన్నాయి. కొత్త ఐపీఓల్లో ఆరు ఎస్​ఎంఈ ఇష్యూలు ఉన్నాయి. వీటిలో కొన్ని భారీ ప్రీమియంతో లిస్టయ్యే అవకాశాలు ఉన్నాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ముఖ్యంగా, చిన్న  మధ్యతరహా పరిశ్రమలు (ఎస్​ఎంఈలు) ఇష్యూలకు గణనీయంగా పెట్టుబడులు వచ్చాయి.  

ఏఐకే పైప్స్​,  పాలిమర్స్

ఏఐకే పైప్స్,  పాలిమర్స్​ ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) డిసెంబర్ 26 (మంగళవారం) నుంచి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.  గురువారం (డిసెంబర్ 28) ముగుస్తుంది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.15 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్  ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.89గా నిర్ణయించారు.  రిటైల్ పెట్టుబడిదారుల కోసం  50శాతం షేర్లను ఇస్తారు. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం 1600 షేర్లు కొనాలి. అంటే  రూ.1,42,400 చెల్లించాలి. 

ఆకాంక్ష పవర్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్

ఆకాంక్ష పవర్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్  ఐపీఓ బుధవారం (డిసెంబర్ 27) సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.  ఇది శుక్రవారం (డిసెంబర్ 29) ముగుస్తుంది. ఇష్యూ ద్వారా 27.49 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తిగా 49.98 లక్షల షేర్ల తాజా ఇష్యూ. ప్రైస్​బ్యాండ్​ను రూ.52–55 మధ్య నిర్ణయించారు. కనీసం 2000 షేర్లు కొనాలి. దాదాపు రూ.1,10,000 చెల్లించాలి.

హెచ్​ఆర్​హెచ్​  నెక్స్ట్ సర్వీసెస్

హెచ్​ఆర్​హెచ్​ నెక్స్ట్ సర్వీసెస్  ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) బుధవారం (డిసెంబర్ 27) సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.  ఇది శుక్రవారం (డిసెంబర్ 29) వరకు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటుంది.  ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.36గా నిర్ణయించారు. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.9.57 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం 3000 షేర్లకు రూ.1,08,000 చెల్లించాలి.

మనోజ్ సిరామిక్

మనోజ్ సిరామిక్  ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) డిసెంబర్ 27 (బుధవారం) నుంచి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.  శుక్రవారం (డిసెంబర్ 29) ముగుస్తుంది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.14.47 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  ఒక్కో షేరు ధరను రూ. 62గా నిర్ణయించారు. మనోజ్ సిరామిక్ ఐపీఓలో రిటైల్ పెట్టుబడిదారులకు 50 శాతం షేర్లు ఇస్తారు.  వీళ్లు కనీసం 2000 షేర్లు కొనాలి. ఇందుకు  రూ.1,24,000 చెల్లించాలి. 

శ్రీ బాలాజీ వాల్వ్ కాంపోనెంట్స్

శ్రీ బాలాజీ వాల్వ్ కాంపోనెంట్స్  ఇనీషియల్​ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) డిసెంబర్ 27 (బుధవారం) నుంచి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.  శుక్రవారం (డిసెంబర్ 29) ముగుస్తుంది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.21.60 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్  ప్రైస్ బ్యాండ్​ను రూ. 95–100 మధ్య నిర్ణయించారు.  రిటైల్ పెట్టుబడిదారుల కోటా 35శాతం ఉంటుంది. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం1200 షేర్లు కొనాలి.  అప్పర్​ బ్యాండ్ ధర వద్ద రూ.1.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

కేసీ ఎనర్జీ అండ్​ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా

కే సీ ఎనర్జీ అండ్​ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా ఐపీఓ డిసెంబర్ 28 (గురువారం) నుంచి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది.  మంగళవారం (జనవరి 2) ముగుస్తుంది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.15.93 కోట్లను సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్  ప్రైస్ బ్యాండ్​ను రూ.51–54 మధ్య నిర్ణయించారు.  రిటైల్ పెట్టుబడిదారుల కోటా 35శాతం ఉంటుంది. వీళ్లు 2000 షేర్లు కొనాలి.  అప్పర్​ బ్యాండ్ ధర రూ.54 వద్ద పెట్టుబడిదారులు రూ.1,08,000 చెల్లించాల్సి ఉంటుంది.