Big Updates: సినీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఇవాళ ఒక్కరోజే 6 సినిమా/వెబ్ సిరీస్ అప్డేట్స్

Big Updates: సినీ లవర్స్కు గుడ్ న్యూస్.. ఇవాళ ఒక్కరోజే 6 సినిమా/వెబ్ సిరీస్ అప్డేట్స్

దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ కి గుడ్ న్యూస్. మీరు చాల రోజులుగా ఎదురుచూస్తున్న సినిమాలకు సంబందించిన అప్డేట్స్ రాబోతున్నాయి. అదికూడా ఒకే రోజు ఎనిమిది సినిమాల అప్డేట్స్. అందులో కొన్ని స్టార్ హీరోల సినిమా  క్రేజీ అండ్ పాపులర్ వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? క్రేజీ వెబ్ సిరీస్ లు ఏంటి? అనే డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 

లిస్టులో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమా ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి గ్లింప్స్ విడుదల కానుంది. పవన, హరీష్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువా మూవీ నుండి కూడా గ్లింప్స్ విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ గ్లింప్స్ మార్చ్ 19 సాయంత్రం 4:30కి విడుదల కానుంది. శౌర్యం ఫేమ్ శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకుక్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

ఇక నాగ చైతన్య హీరోగా వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దూత ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ కు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అదే విషయం ఈరోజు అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

ఇక హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ బ్యూటీ సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్నాడు. ఈ సిరీస్ నుండి ఒక అప్డేట్ రానుంది.

ఇక బాలీవుడ్ స్టార్ మనోజ్ బజ్ పాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రెండు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ కు మరో సీజన్ కూడా రానుంది. ది ఫ్యామిలీ మం సీజన్ 3కి సంబందించిన అప్డేట్ కూడా ఇవాళ రానుంది. 

ఇక ఇండియన్ వెబ్ సిరీస్ ల చరిత్రలో మీర్జాపూర్ సిరీస్ ఒక సంచలనం అని చెప్పాలి. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ కూడా ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు సీజన్ 3 కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సిరీస్ గురించి కూడా అప్డేట్ రానుంది.