స్కూల్ క్యాబ్ను ఢీకొట్టిన టిప్పర్.. నుజ్జునుజ్జయిన శరీర భాగాలు..ఆరుగురు విద్యార్థులతో సహా డ్రైవర్ మృతి

స్కూల్ క్యాబ్ను ఢీకొట్టిన టిప్పర్.. నుజ్జునుజ్జయిన శరీర భాగాలు..ఆరుగురు విద్యార్థులతో సహా డ్రైవర్ మృతి

పంజాబ్ లోని పాటియాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ క్యాబ్ ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబ్ లో ఆరుగురు విద్యార్థులతో పాటు డ్రైవర్ స్పాట్ లోనే మృతిచెందారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్న మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందుతున్నాడు.

పాఠశాల తర్వాత పిల్లలను ఇంటికి దింపేందుకు వెళ్తున్న పాటియాలాలోని భూపీంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు మార్గమధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురిని పాటియాలా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందాడు. 

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు  సమీప ప్రాంతంలో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

►ALSO READ | ఇక మీరు మారరా..? LOC వెంబడి పాక్ ఆర్మీ కాల్పులు..15 మంది మృతి