చాలా మంది వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, జీవితంలో సాధించేందుకు ఇంకా చాలా ఉన్నాయని నిరూపిస్తూ అనేక సాహసాలు, ఆవిష్కరణలు చేస్తుండడం చూస్తూనే ఉంటాం. అలాంటి కోవకే చెందిన వాడు 60ఏళ్ల రాబర్ట్ అనే క్లైంబర్. ఫ్రెంచ్ స్పైడర్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న ఇతను తన 60వ పుట్టినరోజును కాస్త కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా 48అంతస్తుల భవనాన్ని చేతులతో పట్టుకొని ఎక్కేశాడు. ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోకుండా రాబర్ట్ పెద్ద సాహసమే చేశాడు.
ఇలా తన బర్త్ డే సందర్భంగా పారిస్‌లోని 48 అంతస్తుల భవనాన్ని వట్టి చేతులతో పట్టుకొని రాబర్ట్ అనే వ్యక్తి వార్తల్లో నిలిచాడు. ఇతని సాహసాన్ని చూసిన నెటిజన్లు ఔరా అనకుండా ఉండలేకపోతున్నారు. మామూలుగా అరవై ఏళ్లు వచ్చాయంటే చాలు చాలా మంది ముసలోల్లం అయిపోయామనుకుంటారు. కానీ రాబర్ట్ మాత్రం ఎంతో ఉత్సాహంగా అంత పెద్ద బిల్డింగును ఎక్కడంపై సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతనికున్న పట్టుదల అందరికీ ఉంటే జీవితంలో నిరుత్సాహం అన్న పదానికి చోటే ఉండదేమో. ఈ వయసులో కూడా రాబర్ట్ ఈ అద్భుతం చేయగలిగాడంటే యువత ఇంకెంత సాధించొచ్చో కదా అనే సందేశాన్నీ ఇస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తు్న్నారు. అయితే రాబర్ట్ కు ఇది కొత్తేంకాదు. తొలిసారిగా 1975లో పారిస్‌లోని 613 అడుగుల ఎత్తయిన భవనం టోటల్ ఎరన్జీస్‌ని పలుమార్లు ఇలాగే ఎక్కేసి వార్తల్లో నిలిచాడు.
