ఇండిపెండెంట్ దర్యాప్తుకు ఇండియా సహా 62 దేశాల సపోర్ట్

ఇండిపెండెంట్ దర్యాప్తుకు ఇండియా సహా 62 దేశాల సపోర్ట్

జెనీవా: కరోనా ఎక్కడ పుట్టింది దాని వ్యాప్తికి కారణమేంటన్న దానిపై ఇండిపెండెంట్ ప్రొబ్ చేయాలన్న ప్రతిపాదనకు ఇండియా మద్దతు తెలిపింది. కరోనాపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఇండిపెండెంట్ గా దర్యాప్తు చేయాలని ఆస్ట్రేలియా తో పాటు యూరోపియన్ యూనియన్ డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా తీర్మానాన్ని పెట్టింది. ఈ తీర్మానానికి ఇండియా సహా 62 దేశాలు మద్దతు తెలిపాయి. కరోనా విషయంలో డబ్య్లూహెచ్ఓ చైనా కు అనుకూలంగా వ్యవహారించిందంటూ పలు దేశాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఇండిపెండెంట్ ప్రొబ్ జరిపించాలంటూ ఆస్ట్రేలియా ముందుగా డిమాండ్ చేసింది. యూరోపియన్ యూనియన్ కూడా ఇందుకు సపోర్ట్ చేసింది. ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన దేశాల్లో జపాన్, యూకే, న్యూజిలాండ్, సౌత్ కొరియా, బ్రెజిల్, కెనడా లాంటి దేశాలు కూడా ఉన్నాయి. కరోనా క్రైసెస్ ప్రపంచాన్ని కుదేపిస్తున్న సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 73 వ వార్షిక సమావేశాన్ని జెనీవాలో ప్రారంభించింది. ఈ సమావేశాల్లో కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ వైఖరిపై చాలా దేశాలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. కరోనా పుట్టుక దాని వ్యాప్తి విషయంలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహారించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు లో అన్ని విషయాలు తేలనున్నాయి.