ఫారెన్‌లో ఉన్న మనోళ్లలో.. 6300 మందికి కరోనా

ఫారెన్‌లో ఉన్న మనోళ్లలో.. 6300 మందికి కరోనా
  • వారం రోజుల్లో రెండితలైన సంఖ్య
  • ఇప్పటి వరకు చనిపోయినోళ్లు 40 మంది

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న మనోళ్లలో దాదాపు 6300 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 50 దేశాల్లో దాదాపు 40 మంది వరకు చనిపోయినట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 16న 3,336 కేసులు ఉండగా.. కేవలం వారం వ్యవధిలోనే ఆ సంఖ్య డబుల్‌ అయిందని అధికారులు చెప్పారు. మరణాల సంఖ్య కూడా ఒక్కసారిగా 25 నుంచి 40కి పెరిగింది. సింగపూర్‌‌, కువైట్‌లోనే 50 శాతం కేసులు ఉన్నాయని అధికారులు చెప్పారు. కువైట్‌ కంటే సింగపూర్‌‌లో ఉన్న వాళ్లే ఎక్కువగా వ్యాధి బారిన పడ్డారు. మైగ్రెంట్‌ వర్కర్స్‌కు ఇచ్చే డార్మిటరీల్లో ఉన్న 90 శాతం మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వాళ్లందరికీ సింగపూర్‌‌ ప్రభుత్వం ట్రీట్‌మెంట్‌ చేయిస్తుంది. గల్ఫ్‌ కంట్రీస్‌లో ఉన్న 2వేల మంది మనవాళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. విదేశాల్లో ఉన్న 276 మంది మనోళ్లు కరోనా బారిన పడినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి మార్చి 18న పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ఈనెల 16కు ఆ సంఖ్య 3,336కు చేరుకుంది. వాళ్లందరికీ ట్రీట్‌మెంట్‌ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు అన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలతో ప్రభుత్వం టచ్‌లో ఉందని అన్నారు.