చలిమెడ ఆనందరావు మెడికల్‌‌ కాలేజీలో..64 మంది హౌస్‌‌ సర్జన్ల సస్పెన్షన్‌‌

చలిమెడ ఆనందరావు మెడికల్‌‌ కాలేజీలో..64 మంది హౌస్‌‌ సర్జన్ల సస్పెన్షన్‌‌
  • వారం రోజులు సస్పెండ్‌‌ చేసిన చలిమెల ఆనందరావు కాలేజీ యాజమాన్యం
  • స్టైఫండ్‌‌ గురించి ప్రశ్నించడమే కారణమంటున్న బాధితులు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్‌‌ శివారు బొమ్మకల్‌‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్‌‌ కాలేజీలో 64 మంది హౌస్‌‌ సర్జన్లపై సస్పెన్షన్‌‌ వేటు పడింది. తమ పెండింగ్‌‌ స్టైఫండ్ల గురించి హాస్పిటల్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ను నిలదీయడంతో 64 మంది హౌస్‌‌సర్జన్లను జులై 4 నుంచి 10వ తేదీ వరకు సస్పెండ్‌‌ చేస్తూ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రతినిధులు ఆర్డర్స్‌‌ జారీ చేశారు. 

స్టైఫండ్‌‌ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని, తమ న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.