23 ఏండ్ల పిల్లతో 65 ఏండ్ల తండ్రికి పెండ్లి చేసిన బిడ్డలు

23 ఏండ్ల పిల్లతో 65 ఏండ్ల తండ్రికి పెండ్లి చేసిన బిడ్డలు

60 ఏళ్లకు షష్టి పూర్తి చేసుకోవడం సంప్రదాయం. కానీ ఆరు పదుల వయసు దాటిన ఓ తాత కొత్త పెళ్లి కొడుకు అయ్యాడు. 65 ఏండ్ల వయసులో 23 ఏండ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీలో జిల్లాలో జరిగిన ఈ వివాహం ఇప్పుడు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

యూపీలోని హుసైనాబాద్ కు నఖేడ్ యాదవ్ వయసు 65 ఏండ్లు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు. కొన్నేళ్ల క్రితం నఖేద్ యాదవ్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆయనే కూతుర్లను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాడు. కూతుర్లంతా అత్తవారింటికి వెళ్లిపోవడంతో...నఖేత్ ఒంటరివాడయ్యాడు. దాని నుంచి బయటపడేందుకు నఖేద్ రెండో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కూతుళ్లకు ఆ విషయం చెప్పడంతో వారు అందుకు ఓకే చెప్పారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో రుదౌలీలోని కామాఖ్యదేవి ఆలయంలో 23ఏండ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నఖేద్ యాదవ్ బరాత్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ బరాత్లో నఖేద్ యాదవ్ ఆరుగురు కుమార్తెలు, బంధువులు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. వారితో కలిసి 65 ఏళ్ల నఖేద్ యాదవ్ కూడా స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ బరాత్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.