దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న రజినీకాంత్ 

దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న రజినీకాంత్ 

న్యూఢిల్లీ: దేశ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం సోమవారం జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజేతలకు అవార్డులు అందజేశారు. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు విశిష్ట అవార్డు వరించింది. మూవీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఉత్తమ నటుడి పురస్కారాన్ని హిందీ నటుడు మనోజ్ భాజ్‌పాయ్ (భోంస్లే చిత్రం), తమిళ హీరో ధనుష్ (అసురన్) అందుకున్నారు. ‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్‌ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైన మహర్షి మూవీకి గానూ నిర్మాత దిల్ రాజు అవార్డును అందుకున్నారు. ఆ  సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లికి స్వర్ణ కమలం దక్కింది.   

మరిన్ని వార్తల కోసం: 

టీఆర్ఎస్‌‌కు అధిష్టానం లేదు.. బాసులు లేరు

చైనాలో డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభిస్తోందా?

పైసలిచ్చి పదవులు తెచ్చుకున్నోళ్లు ఎగిరెగిరి పడుతున్రు