చైనాలో డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభిస్తోందా?

చైనాలో డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభిస్తోందా?

బీజింగ్: చైనాలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. అక్కడ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. డ్రాగన్ కంట్రీలో కొవిడ్ కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ కారణమని ఆ దేశ హెల్త్ కమిషన్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

గత వారం రోజుల్లో చైనాలోని 11 ప్రావిన్సులకు కొవిడ్ వ్యాపించిందని ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ అన్నారు. కరోనా పాటివివ్‌గా తేలిన వ్యక్తుల్లో చాలా మంది విదేశీ ప్రయాణాలు కూడా చేశారన్నారు. కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు వెంటనే అప్రమత్తం అవ్వాలని.. పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని సూచించారు. కాగా, డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో చైనాలోని ఇన్నర్ మంగోలియాలో పలు కఠిన ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి అందరూ ఇళ్లలోనే  ఉండాలని అక్కడి ప్రజలను స్థానిక ప్రభుత్వం కోరింది. 

మరిన్ని వార్తల కోసం: 

కందికొండను.. కాపాడుకుందాం

సీఎం నువ్వే.. 20 ఏళ్లుగా పార్టీ చీఫ్ నువ్వేనా?

రెస్టారెంట్‌‌గా మారిన విమానం