69 జాతీయ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ హవా.. విజేతలు వీళ్ళే

69 జాతీయ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ హవా.. విజేతలు వీళ్ళే

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‏లో గురువారం(ఆగస్టు 24) సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించింది జ్యురీ. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 31 కేటగిరీలకు గాను అవార్డులను ప్రకటిస్తుండగా.. నాన్ ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 24 కేటగిరీలకు గాను అవార్డులను ప్రకటించనున్నారు. ఈ పోటీల్లో నటీనటులకు, సాంకేతిక నిపుణుల మధ్య గట్టి పోటీ జరిగింది.

2023 జాతీయ అవార్డులు అందుకున్న వారి లిస్ట్ ఇలా ఉంది. 

– ఉత్త‌మ చిత్రం ఉప్పెన‌


– జాతీయ ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్ (పుష్ప‌)

– ఉత్త‌మ న‌టి అలియా భ‌ట్‌

– బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్ కాల‌భైర‌వ (కొమురంభీముడో..)

– ఉత్త‌మ వినోదాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్‌

– ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ ఆర్ఆర్ఆర్ (ప్రేమ్ ర‌క్షిత్‌)

– బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ (పుష్ప‌)

– బెస్ట్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (కీర‌వాణి)

– ఉత్త‌మ లిరిక్స్ కొండ‌పొలం (చంద్ర‌బోస్‌)

– క్రిటిక్స్ స్పెషల్ మెన్షన్ ఫిల్మ్ – సుబ్రమణ్య బాదూర్ (Kannada)

– బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – పురుషోత్తమ చార్యులు (Telugu)

– బెస్ట్ బుక్ ఆన్ సినిమా – ది ఇన్‌క్రీడిబుల్ మెలోడియస్ జర్నీ (రచయిత రాజీవ్ విజయకర్)