వేసవిలో 692 ప్రత్యేక రైళ్లు

వేసవిలో 692 ప్రత్యేక రైళ్లు

రైల్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ మెరుగైన సౌకర్యలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైళ్ల సంఖ్యను పెంచింది. వేసవి రావడంతో చాలా మంది జర్నీలు చేస్తుంటారు. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేసవి కి స్పెషల్ రైళ్లను ప్రారంభించింది. ఇందులో భాగంగా 692 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ వరకు రెండు నెలల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 రైళ్లను ఎప్పుడూ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. స్కూళ్లు,కాలేజీలకు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.